కరోనా కోసం రాపిడ్ యాంటీబాడీ బ్లడ్ టెస్ట్

by vinod kumar |
కరోనా కోసం రాపిడ్ యాంటీబాడీ బ్లడ్ టెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకీ కరోనా వైరస్ కారణంగా మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కొవిడ్ 19 పరీక్షలు వేగవంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం రక్తం నమూనాలతో చేసే రాపిడ్ యాంటీబాడీ టెస్టును అనుసరించాలని సూచించారు. ప్రస్తుతానికి ఎక్కువగా జనాలు సంచరించే ప్రాంతాల్లో, కాంటామినెంట్ కేంద్రాల్లో రాపిడ్ యాంటీబాడీ టెస్టులను మొదటగా ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు భారతదేశంలో గొంతు, నాసిక స్వాబ్ మీద ఆధారంగా చేసే ఆర్‌టీ పీసీఆర్ టెస్టు ద్వారా కొవిడ్ 19 గుర్తించారు. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న టెస్టు, అలాగే సమయం కూడా ఎక్కువే. మరోవైపు యాంటీబాడీ టెస్టు చాలా తక్కువ ఖర్చు, వేగవంతమైనది కూడా.

ఏదైనా వైరస్ దాడికి శరీరం గురైనపుడు తెల్లరక్తకణాలు యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీ టెస్టుల్లో వాటినే గుర్తిస్తారు. రక్తం నమూనాలో ఐజీజీ యాంటీబాడీస్ గుర్తించడం కోసం ఈ రాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్ వాడతారు. గతంలో పరీక్ష చేయించుకోకుండా, సెల్ఫ్ రికవరీ అయిన పేషెంటుని కూడా ఈ యాంటీబాడీ టెస్టు ద్వారా గుర్తించొచ్చు. దీంతో కరోనా వ్యాధిగ్రస్తుల గురించి కచ్చితమైన సమాచారం ప్రభుత్వానికి తెలుస్తుంది.

అయితే యాంటీబాడీ టెస్టు ఫలితం ఒకవేళ నెగెటివ్‌గా వస్తే కరోనా లేనట్లు కాదని, కరోనా ఉన్నవాళ్లని రెండోసారి టెస్టు చేసి నిర్ధారించడానికి మాత్రమే ఈ టెస్టు ఉపయోగపడుతుంది. మొదటిసారి పరీక్షలో మాత్రం యాంటీబాడీ టెస్టు ఫలితాన్ని తుదినిర్ణయంగా తీసుకోవద్దు. కచ్చితంగా పీసీఆర్ టెస్టు చేసే, తుది నిర్ణయం తీసుకోవాలి.

Tags: Corona, Covid, Antibody test, Negative, PCR test

Advertisement

Next Story

Most Viewed