- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగేళ్ల పాపపై అత్యాచారం.. బెదిరింపులు
దిశ, హైదరాబాద్: నాలుగేళ్ల పాపపై అత్యాచారం చేయడమే కాకుండా బాధిత తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఓ దంపతులు గత కొంతకాలంగా హౌస్ కీపింగ్, మెస్ కుకింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కూతురు ఉంది. అయితే అదే కాలేజీలో అంజయ్య అనే ఉద్యోగి ఈ నెల 10వ తేదిన బాలికపై అత్యాచారం చేశాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు రూ. 10 వేలు, సెల్ ఫోన్ ఇస్తాను.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బాధిత తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. నిందితుడికి మద్దతుగా శ్రీచైతన్య కాలేజీ ఎంజీఎం అనిల్, మెస్ ఇన్‌ఛార్జ్ గోపి, ఏఓలు దుర్గాప్రసాద్, కళ్యాణ్‌లు కేసును వెనక్కి తీసుకొవాలని బలవంతపెడుతున్నారని బాధితులు వాపోయారన్నారు. లేని పక్షంలో చంపేస్తామంటూ బెదిరించారన్నారు. దిక్కుతోచని స్థితిలో బాధిత తల్లిదండ్రులు బాలల హక్కుల సంఘాన్నిఆశ్రయించారని అచ్యుతరావు వెల్లడించారు. నిందితులను వెంటనే పోక్సో చట్టం ప్రకారం శిక్షించి.. తల్లి దండ్రులకు రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి మాదాపూర్ శ్రీ చైతన్య యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు డిమాండ్ చేశారు.
Tag: rape case, 4 years old girl, Children’s Rights, Achyuta Rao, madhapur