Crime News: ఆంధ్రా అమ్మాయిపై నైజీరియన్ల అత్యాచారం

by Sumithra |   ( Updated:2021-09-04 00:35:56.0  )
gang rape news
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి. మహిళలకోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, అవి రక్షణ ఇవ్వడంలో విఫలం అవుతున్నాయి అనడానికి అనేక సంఘటనలున్నాయి. తాజాగా బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు అబుజి ఉబాకా, టోనీలను బాణసవాడి పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా వీరి అరెస్ట్‌కు సంబంధించి నైజీరియా రాయ‌బార కార్యాల‌యానికి కూడా పోలీసులు ఇప్పటికే స‌మాచారం అందించారు. ప్రస్తుతం బాధితురాలిని వైద్య ప‌రీక్షల నిమిత్తం ఓ ఆస్పత్రికి త‌రలించిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed