నిర్మల్ జిల్లాలో థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభం

by Aamani |
నిర్మల్ జిల్లాలో థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభం
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అన్నారు. నిర్మల్ రూరల్ పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద వైద్యఆరోగ్య, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాండమ్ థర్మల్ స్క్రీనింగ్ టెస్టింగ్‌‌ను ఆయన పర్యవేక్షించారు. రోడ్డుపై వెళ్తున్న 200 మందికి థర్మల్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షించిన వారిలో ఎవరికీ జ్వరం, కొవిడ్ లక్షణాలు కనిపించలేదని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్న 20 మంది హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించామని, అందులో 12 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మిగిలిన 8 మంది త్వరలో డిశ్చార్జ్ అవుతారని ఆకాంక్షించారు. కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. మే 7 వరకు ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, వెంకట్‌రెడ్డి, జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వసంత్‌రావు, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, జాన్ దివాకర్, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: Nirmal,collector Musharraf Pharukhi,Random thermal screening

Advertisement

Next Story

Most Viewed