దివాళీ కాంతుల్లో బాలీవుడ్ జంట

by Shyam |
దివాళీ కాంతుల్లో బాలీవుడ్ జంట
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే కాదు, బ్రేకప్ స్టోరీలకు కొదువ లేదు. అయితే పెళ్లి పీటలు ఎక్కేవరకు ఆ ప్రేమ పక్షులు ఒకే గూటికి చేరుతారన్న నమ్మకమైతే లేదు. ప్రస్తుతం బీటౌన్‌లో హాట్ టాపిక్‌ ప్రేమ జంట.. ఆలియా, రణ్‌బీర్ కపూర్. వీరిద్దరూ తమ మనసులోని మాటను అభిమానులకు చెప్పకపోయినా, వారు చేసే పనులే తమ ప్రేమ వ్యవహారాన్ని బహిర్గతపరిచాయి. తాజాగా అదే విషయం మరోసారి నిరూపితమైంది. ఈ యంగ్ కపుల్ తమ స్టాఫ్‌తో కలిసి దివాళీ సెలబ్రేషన్స్‌ను ఆలియా ఇంట్లో హ్యాపీగా జరుపుకుంది.

ఆలియా దీపాల వెలుగులో బ్లాక్ అనార్కలీ సూట్‌లో మెరిసిపోగా, రణ్‌బీర్ రెడ్ కుర్తాలో దర్శనమిచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరూ ఫ్యామిలీ ఫంక్షన్స్, ఔటింగ్స్‌లో జంటగా కనిపిస్తూ ఫ్యాన్స్‌కు తాము త్వరలోనే ఒక్కటి కాబోతున్నామనే సందేశాన్నిస్తున్నారు. ప్రస్తుతం ఆలియా, రణ్‌బీర్.. అయాన్ ముఖర్జీ ట్రయాలజీ ‘బ్రహ్మస్త్ర’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

మరి ఈ బాలీవుడ్ ప్రేమ జంట ఈ ఏడాదైనా ఏడడుగులు వేసి.. అభిమానుల ఊహాగానాలకు, గాసిప్స్‌కు ఫుల్‌స్టాప్ పెడతారో లేదో చూడాలి. ఇక రణ్‌బీర్‌ విషయానికొస్తే ప్రస్తుతం ‘షమ్‌షేరా’ చిత్రం చేస్తుండగా, ఆలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌, గంగూబాయి కతియావాడి’ చిత్రాలు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed