- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విహారంలో రానా మిహిక
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హంక్ రానా తన స్నేహితురాలు మిహికా బజాజ్‌ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో పెళ్లి కావడంతో.. ఈ జంట ఇంటికే పరిమితమైంది. కరోనా నిబంధనల కారణంగా పెళ్లి తర్వాత ఎక్కడికీ వెళ్లలేకపోయారు. అయితే ప్రస్తుతం పర్యాటక ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వడంతో.. రానా మిహికాలు హానీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఫారిన్‌లోని ఓ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ దిగిన సెల్ఫీ పిక్స్‌ను మిహికా తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ.. ‘జస్ట్ బికాజ్ ఆఫ్ రానా’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీనికి మంచు లక్ష్మీ నవ్వుతున్న ఎమోజీ పోస్ట్ చేసింది. ఇక ఈ హాలీడే ట్రిప్ తర్వాత వచ్చే నెలలో ‘విరాటపర్వం’ షూటింగ్‌లో పాల్గొననున్నాడు రానా.
రామానాయుడు స్టూడియోలో 2020, ఆగస్టు 08వ తేదీన రానా, మిహికాల వివాహానికి కరోనా నేపథ్యంలో ఇరు కుటుంబాల నుంచి చాలా తక్కువ మంది బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లికి రాని వారు వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా వీరి వివాహాన్ని తిలకించారు.