- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రానా, అఖిల్ ఢీకొనేది అప్పుడే
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమాలు.. పండగపూట విడుదలైతే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. అందుకే మేకర్స్ తమ సినిమాలను సంక్రాంతి, దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. వీటితో పాటు సమ్మర్ సీజన్ కూడా సినీ ప్రేక్షకులకు ఓ పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసినా, సంక్రాంతి పందెం కోళ్లుగా బరిలో నిలిచిన సినిమాలు తక్కువనే చెప్పాలి. ఈ మేరకు మొదట రవితేజ ‘క్రాక్’ సినిమా థియేటర్లో సందడి చేయగా, బెల్లంకొండ నటించిన అల్లుడు ‘అదుర్స్’, రామ్ ‘రెడ్’తో పాటు తమిళ హీరో విజయ్ ‘మాస్టర్’ సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇక నెక్ట్స్ టార్గెట్ వేసవి కాగా.. అఫిషియల్‌గా ‘విరాటపర్వం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు వేసవిలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.
తొలి చిత్రం ‘నీది నాది ఒకే కథ’తోనే ఇండస్ట్రీ వర్గాల్లో టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న వేణు ఊడుగుల.. తన రెండో ప్రాజెక్ట్‌గా ‘విరాటపర్వం’ను విలక్షణమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించి అందరిలో ఆసక్తిని పెంచాడు. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేయడంతో పాటు సినిమాను సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. న్యూ పోస్టర్‌లో.. నక్సలైట్ గెటప్‌లో కనిపిస్తున్న రానా చేయి పట్టుకొని సాయి పల్లవి నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక ఇందులో కామ్రేడ్ భారతక్క పాత్రలో నటి ప్రియమణి నటిస్తుండగా.. నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీరావు, సాయిచంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో.. చార్మింగ్ హీరో అఖిల్ అక్కినేని, లక్కీ బ్యూటీ పూజ హెగ్డేలు కలిసి నటిస్తున్న మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా వస్తున్న ఈ సినిమా విడుదలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేకపోగా, సంక్రాంతి కానుకగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. వేసవిలో సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో పాటు అభిమానులకు సంక్రాంతి విషెస్ అందిస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
కరోనా కొత్త స్ట్రెయిన్‌తో పాటు 50 శాతం కెపాసిటీతోనే థియేటర్లు రన్ కావడంతో సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలన్నీ పోస్ట్‌పోన్ కాగా, అవన్నీ సమ్మర్‌లో రిలీజయ్యే అవకాశముంది. ఈ క్రమంలోనే సమ్మర్‌లో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొననుండగా, దాదాపు డజనుకు పైగా సినిమాలు వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా తెలుస్తోంది. ‘వకీల్ సాబ్, టక్ జగదీష్, రంగ్ దే, ఆచార్య, నారప్ప, సీటిమార్, ఫైటర్, రాధే శ్యామ్, శ్రీకారం’ వంటి సినిమాలన్నీ సమ్మర్ రేసులో నిలవనున్నాయి.