- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రేజీ ఛాన్స్ మిస్ చేసుకున్న రమ్యకృష్ణ
రమ్యకృష్ణ… నీలాంబరిగా తన అభినయంతో రజినీకాంత్‌కే సవాల్ విసిరిన నటి… బాహుబలి తల్లి శివగామిగాను అంతే పవర్ ఫుల్‌నెస్ చూపించింది. మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆమె చేసే పోరాటం, డైలాగ్స్.. ఎట్ ఏ టైమ్ బిడ్డల పట్ల చూపించే ప్రేమ.. వావ్ అనిపించేలా ఉంటాయ్. ఆ నటనకు ఫిదా అయ్యే..కేజీఎఫ్-2 టీమ్ రమ్యకృష్ణను కీలక పాత్రకు ఎంచుకున్నారట. సినిమాలో మహిళా ప్రధానమంత్రి పాత్రలో పవర్‌ఫుల్ రోల్‌కు సంప్రదించారట. కానీ రమ్య.. బాహుబలి ఎఫెక్టో ఏమో, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఈ ఛాన్స్ కాస్త సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌ను వరించింది.
పాన్ ఇండియా మూవీగా, క్రేజీ ప్రాజెక్ట్‌గా వస్తున్న సినిమాలో అవకాశం కోసం ఎంతో మంది క్యూలో ఉండగా.. ఇంత మంచి కీలకపాత్రను కాదనుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు బాధపడుతున్నారట. కాగా జూలై 2020లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.