కరోనాపై రామారావు సూచన

by Shyam |
కరోనాపై రామారావు సూచన
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కరోనా కట్టడి కోసం పోలీసులు చేస్తున్న కృషి అద్వితీయమని, ప్రజాలంతా కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ ఎం.వి. పట్టాభి రామారావు సూచించారు. సోమవారం పంజాబ్ నేషనల్ బ్యాంక్, హైదరాబాద్ రోడ్డు శాఖ ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం సమక్షంలో పోలీస్ శాఖకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ – 19 రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలంతా అన్ని రకాల జాగ్రతలు పాటించాలని.. ముఖ్యంగా బయటికి వచ్చే సమయంలో విధిగా మాస్కు ధరించాలని కోరారు. కరోనాపై ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, శానిటేషన్ సిబ్బందికి ప్రజలంతా సహకరించి కరోనా కట్టడిలో తమవంతు భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. పోలీసులు చేస్తున్న కృషికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో శానిటైజర్లు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులలో వినియోగదారులు, సిబ్బంది రక్షణ లక్ష్యంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంతున్నాయని, ప్రతినిత్యం తమ బ్యాంకులో శానిటైజ్ చేయిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం, అసిస్టెంట్ మేనేజర్లు కమల, ఎన్. సుధీర్, జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ కె. దయాకర్ రావు, పోలీస్ కార్యాలయ సిబ్బంది బి. రాజు, కె. సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed