రాజమౌళికి పాజిటివ్.. రామ్ గోపాల్ వర్మ కౌంటర్

by Shyam |
రాజమౌళికి పాజిటివ్.. రామ్ గోపాల్ వర్మ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. 'రాజమౌళి సర్.. మీ సైనికుడు 'బాహుబలి'ని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరగా కరోనా నుంచి కోలుకుంటార'ని వర్మ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. అయితే రాజమౌళికి పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed