టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

by Anukaran |
Ram Gopal Varma, MLA Nomula Bhagath
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే తెలుగు చిత్ర పరిశ్రమలోని కొందరి నటుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. కేవలం సినిమాలపైనే కాకుండా రాజకీయపరంగా కూడా యాక్టివ్‌గా ఎప్పటికప్పుడు ట్వీట్ల ద్వారా సంచలనం సృష్టించే ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ముందు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గురించి ఆర్జీవీ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. తాజాగా.. మరోసారి నోముల భగత్‌ను ఆకాశానికెత్తేస్తూ ఆయన చేసిన పోస్టు తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది.

ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశాడు. ఈ సంరద్భంగా భగత్‌ ఆర్జీవీతో ఓ ఫోటో దిగాడు. దీంతో ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఆర్జీవీ మరోసారి వైరల్ అయ్యాడు. ‘‘నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ నోముల సింహమా..? లేక సింహానికే సింహమా..? అనేది నల్లగొండ ప్రజలు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న నల్లగొండ జిల్లా ప్రజలందరికీ అని, దయచేసి సమాధానం చెప్పండి ప్లీజ్’’ అంటూ రామ్ గోపాల్ వర్మ వీడియోతో ట్వీట్ చేశారు.

Advertisement

Next Story