- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దెబ్బతిన్న మొక్కలతో అసెంబ్లీకి..
దిశ, ఏపీ బ్యూరో : నివర్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లారు. ఫ్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. జీవనోపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని డిమాండ్చేశారు. ప్రతీ పేద కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లిస్తామన్నా అడ్డు పడ్డారు. రాష్ర్ట ప్రభుత్వమూ కట్టలేదు. రైతులను నిండా ముంచేశారని దుయ్యబట్టారు. బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్చేశారు. మైక్రో ఇరిగేషన్ సబ్సిడీకి మంగళం పాడారాని చెప్పారు. రైతులకు రూ.20 వేల కోట్ల భరోసాను ఎగ్గొట్టినట్టు తెలిపారు. టీడీపీ హయాంలో అమలు చేసిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రుణ మాఫీ కింద రూ.8 వేల కోట్లను ఎగవేసినట్లు ఆరోపించారు. మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులే వైసీపీని తరిమికొడతారని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీది మోసగాళ్ల పాలనగా వర్ణించారు.