తమ్ముడే బెస్ట్ ఫ్రెండ్ అంటున్న రకుల్ ….

by Shyam |
తమ్ముడే బెస్ట్ ఫ్రెండ్ అంటున్న రకుల్ ….
X

దిశ, వెబ్‌డెస్క్: రకుల్ ప్రీత్ సింగ్ .. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు బిజీ షెడ్యూల్‌తో ఉండే భామ.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తన గురించి వదిలేస్తే.. సోదరుడు అమన్ ప్రీత్ ఈ ఏడాది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే చాన్స్ ఉండడంతో ఫుల్ ఖుష్ అవుతోంది. ఏప్రిల్ 1న అమన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్‌తో విష్ చేసింది రకుల్. 1993 నుంచి నన్ను నవ్విస్తూనే ఉన్నావు అమన్ … నువ్వే నా బలం, స్నేహం, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని తెలిపింది. ఈ ఏడాది నీకు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని కాంక్షించిన రకుల్… లవ్ యూ బ్రదర్ అంటూ తమ్ముడితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. రకుల్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన అమన్ థాంక్స్ చెప్పాడు. కాగా అమన్ ‘నిన్నే పెళ్లాడతా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా… ‘రామరాజ్య’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అమన్ బర్త్ డే సందర్భంగా ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా నుంచి ‘పొద్దున్నే లేస్తూనే’ సాంగ్ రిలీజ్ కాగా ఆకట్టుకుంది.


Tags: Rakul Preeth Singh, Aman Preeth Singh, HBD, Tollywood, Bollywood

Advertisement

Next Story