- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రాఖీ' మిగిల్చిన విషాదం.. ఐదుగురు అక్కాచెల్లెళ్లను ఏడిపించిన ఒక్కగానొక్క అన్న
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రక్షాబంధన్ రోజు ఎంతో ఆశగా అన్నకు రాఖీ కడదామని వెళ్లిన ఆ అక్కాచెల్లెళ్లకు అన్న మృత్యువాత పడ్డాడని తెలిసి ఒక్కసారిగా కుదేలయ్యారు. అయినా తమ బంధాన్ని చావు కూడా విడదీయలేదని తెలుపుతూ అన్న మృతదేహానికి రాఖీలు కట్టిన ఘటన మాలగూడెంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. నల్గొండ జిల్లా మాలగూడెంలో ఉంటున్న చింతపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తికి ఐదుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు.
గతకొంతకాలంగా లక్ష్మయ్యకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇక నేడు రాఖీ పర్వదినం కావున ఐదుగురు అక్కాచెల్లెళ్లు అన్నకు రాఖీ కట్టడానికి లక్ష్మయ్య ఇంటికి వచ్చారు. ఎంతో ఆశగా అన్నకు రాఖీ కడదామనుకుంలోపు అన్న కళ్ళముందే తుది శ్వాస విడిచాడు. దీంతో వారి గుండె ముక్కలయింది. తమకు ఇదే చివరి రక్షా బంధన్ అవుతుందని ఊహించలేదని, తమ బంధాన్ని చావు కూడా విడదీయలేదని ఆవేదనతో మృతదేహానికే రాఖీ కట్టారు. అన్నాచెల్లెళ్ల బంధం విలువ చెప్పేలా ఉన్న ఈ సంఘటన చూసినవారందరి చేత కంటతడి పెట్టించింది.