- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'కరోనా ప్యార్ హై'
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా గజగజ వణుతున్న వేళ సినీ ఇండస్ట్రీ ఆ పేరును వాడుకునే పనిలో పడింది. ఈ మధ్య కన్నడ డైరెక్టర్ ‘డెడ్లీ కరోనా’ టైటిల్ రిజిస్టర్ చేసుకుని ప్రపంచంపై కరోనా ప్రభావం నేపథ్యంలో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్ ఫుల్ ఫ్మిల్మ్ ప్రొడక్షన్ హౌజ్ కూడా కరోనా టైటిల్ రిజిస్టర్ చేసింది. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ‘కరోనా ప్యార్ హై’ పేరుతో ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో టైటిల్ రిజిస్టర్ చేయించింది. ఇది కాస్త డైరెక్టర్ రాకేశ్ రోషన్ ఫిల్మ్ ‘కహోనా ప్యార్ హై’ సినిమా టైటిల్‌ను గుర్తు తెచ్చేలా ఉంది.
దీనిపై స్పందించిన రాకేష్ రోషన్ ఇదంతా చైల్డిష్‌గా ఉందన్నారు. పరిణతి లేకుండా ఇలాంటి టైటిల్స్ రిజిస్టర్ చేస్తున్నారని .. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న పరిస్థితిని ఎగతాళి చేసినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ‘కహోనా ప్యార్ హై’ టైటిల్‌ను పోలిన ‘కరోనా ప్యార్ హై’ సినిమా టైటిల్‌పై ఫిర్యాదు చేస్తారా అని ప్రశ్నిస్తే… టైటిల్‌లో అర్ధం వేరుగా ఉందని.. అలా ఫిర్యాదు చేసే అవసరం లేదని చెప్పారు.
tags : CoronaVirus, Rakesh Roshan, Corona Pyaar Hai, Eros International