- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడు రోజుల్లో రూ. 57 కోట్ల లాభాలు రాబట్టిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా!
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ స్టాక్ మార్కెట్లలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే. సరైన సమయంలో తగిన వ్యూహం, కంపెనీల పనితీరును పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్లలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి తక్కువ వ్యవధిలో భారీ లాభాలు సాధించి మరోసారి తన సత్తా చాటారు. వారం రోజుల క్రితం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా జీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి చెందిన షేర్లను కొనుగోలు చేశారు. తాజాగా ఆ కంపెనీ షేర్లు ఒక్కరోజే 30 శాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఆయన వాటా విలువ ఏకంగా 61 శాతం పెరిగింది.
ఈ నెల రెండో వారంలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రేట్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 50 లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఆ సమయంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ షేర్ విలువ ఒక్కోటి రూ. 220.44తో కొనుగోలు చేసింది. దానికోసం మొత్తం రూ. 110 కోట్లను కంపెనీ చెల్లించింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీకి సంబంధించి సానుకూల వార్తలు రావడంతో షేర్ విలువ పుంజుకుంది.
బుధవారం జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను సోనీ పిక్చర్స్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించడంతో షేర్ ధర ఏకంగా 39 శాతం వరకు దూసుకెళ్లింది. ఆ తర్వాత కొంత తగ్గి 31.86 శాతంతో రూ. 333.77 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆధారంగా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు రూ. 177.67 కోట్లు పెరిగి వాటాల విలువ ఏకంగా రూ. 56.63 కోట్లు పెరిగింది.
- Tags
- Investment