- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభకు ‘ఎంపి’క చేస్తాం!
ఆంధ్రప్రదేశ్ నుంచి చట్టసభలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అర్హులను రాజ్యసభకు పంపేందుకు రాజకీయ పార్టీలతో పాటు ఖాళీ చేయనున్న రాజకీయ నాయకులు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకునే తరుణం ఆసన్నమైంది.
55 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 17 రాష్ట్రాల్లోని 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి స్థానంలో తిరిగి వారిని లేదా కొత్త వారిని పంపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు, తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సమర్పించిన నామినేషన్లు పరిశీలన మార్చి 16 వరకు జరుగనుంది. మార్చి 18 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. మార్చి 26న పోలింగ్ జరుగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తైన వెంటనే ఫలితాలను వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు చెందిన కేకే (కే.కేశవరావు), తోట సీతారామలక్ష్మి, ఎం.ఎ.ఖాన్, టి.సుబ్బరామిరెడ్డిల స్థానాలు ఖాళీ కానుండగా తెలంగాణలో ఏపీకి చెందిన కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావులు పదవులు కోల్పోనున్నారు. వారి స్థానంలో ఆయా పార్టీలు పంపే అభ్యర్థులు రాజ్యసభకు వెళ్లనున్నారు.