- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిరిండియా, గెయిల్‌లకు కొత్త బాసులు!
సీనియర్ ప్రభుత్వాధికారి రాజీవ్ బన్సాల్ ఎయిర్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టారు. అశ్వని లోహాని నుంచి ఈ బాధ్యతలను ఆయన స్వీకరించారు. అప్పుల బారిన పడిన ఎయిర్ ఇండియాను విక్రయించడానికి ప్రభుత్వం మరోసారి ముందుకు వస్తున్న క్రమంలో రాజీవ్ బన్సాల్ నియామకం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
నాగాలాండ్ కేడర్ 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ బన్సాల్ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. గత వారం కేబినేట్ నియామక కమిటీ ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా బన్సాల్ నియామకాన్ని ఆమోదించింది. గతంలో 2017లో బన్సాల్ మూడు నెలల కాలానికి ఎయిర్ ఇండియా తాత్కాలిక సీఎండీగా పనిచేశారు. ఆ సమయంలో బన్సాల్ ఎయిర్ ఇండియా కోసం అనేక చర్యలు తీసుకున్నారు. స్వల్పకాలంలోనే కోపెన్‌హాగన్, ఇంకా ఇతర ప్రాంతాలకు ఎయిర్ ఇండియా సేవలు విస్తరించడంలో కృషి చేశారు. అలాగే, ఎయిర్ ఇండియా ఖర్చులను తగ్గించేందుకూ, విమానాల పని తీరును మెరుగుపరిచేందుకూ బన్సాల్ చర్యలు తీసుకున్నారు.
హర్యానాకు చెందిన బన్సాల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ఆ సమయంలో డిజిటల్ చెల్లింపులు, ఆధార్ వ్యవహారాలను చూసుకున్నారు. మూడు దశాబ్దాల వృత్తిజీవితంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. పౌర విమానాయన మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు. నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన విధులను నిర్వహించారు. ఎయిర్ ఇండియాలో మొత్తం వాటాను ప్రభుత్వం అమ్మేందుకు సిద్ధమైన ఈ సమయంలో బన్సాల్ నియామకం చాలా కీలకమైనదిగా మారింది. ప్రతిష్ఠాత్మకంగా వ్యూహాత్మక పెట్టుబడులలో భాగంగా ప్రభుత్వం జనవరి 27న ఎయిర్ ఇండియాలోని 100 శాతం వాటాను విక్రయించడానికి బిడ్‌లను ఆహ్వానించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా రూ. 60,000 కోట్ల అప్పుల్లో ఉంది.
గెయిల్ ఛైర్మన్‌గా మనోజ్ జైన్
మరో ప్రభుత్వ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) ఛైర్మన్ అండ్ మేనేజిగ్ డైరెక్టర్‌గా మనోజ్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. 1985లో గెయిల్ సంస్థలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా చేరిన మనోజ్ ఎంబీయేలో ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ చేశారు. సీఎండీగా నియమించడానికి ముందు మనోజ్ గెయిల్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నారు. గెయిల్ వివరాల ప్రకారం… మనోజ్ జైన్ వ్యాపారాభివృద్ధి, ప్రాజెక్టులు, పెట్రోకెమికల్స్, పైప్‌లైన్ నిర్వహణ, గ్యాస్ మార్కెటింగ్ విభాగాలలో గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నారు. అలాగే, సహజ వాయువు పైప్‌లైన్ల నిర్వహణలో పనిచేశారు.