- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్
దిశ, సినిమా : ఆరు పదుల వయసులో కూడా తనదైన స్టైల్‌తో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగల నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ప్రసంగంలో అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత స్వల్ప అస్వస్థతకు గురైన రజినీని ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు.
దీంతో అభిమానులు రజినీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. తాజాగా రజనీ అభిమానులకు తీపికబురు అందించారు. ‘నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను’ అంటూ తాను ఇంటికి చేరుకున్న ఫొటోను షేర్ చేయగా.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజినీకాంత్ మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ గుర్తించామని, అందుకు సరైన చికిత్స చేశామని వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
https://twitter.com/rajinikanth/status/1454858945797898251?ref_src=twsrc^google|twcamp^serp|twgr^tweet