- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధాని అమరావతి పిటిషన్లపై విచారణ వాయిదా..
దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. రాజధాని అమరావతి పిటిషన్లపై సోమవారం త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కరోనా కేసుల నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు..పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరడంతో ధర్మాసనం విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. అటు ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన లాయర్లు సైతం ఈ నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేయడంతో చీఫ్ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. నవంబర్ 15 నుంచి ప్రతీ రోజు వాదనలు గతంలో మాదిరిగా యథావిధిగా ప్రతిరోజు ముందుగా పిటిషన్లు దాఖలు చేసిన వారు.. తదుపరి ప్రతివాదుల తరపు వాదనలు జరుగుతాయని తెలిపింది. తదనంతరం తీర్పు వెల్లడించనున్నట్లు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది.
ఇకపోతే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టం, కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది మార్చి 26న పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ ఎస్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఫిర్యాదులపై విచారణ జరిపింది. తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది. అయితే జస్టిస్ మహేశ్వరి బదిలీ కావడం.. కరోనా.. వేసవి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా వేశామని, వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.