బెంగాల్ సీఎంపై గవర్నర్ ఆరోపణలు

by Anukaran |   ( Updated:2020-08-16 09:59:06.0  )
బెంగాల్ సీఎంపై గవర్నర్ ఆరోపణలు
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సర్కారు రాజ్‌భవన్‌పై నిఘా వేసిందని, ఇది దాని పవిత్రతను తగ్గిస్తుందని గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ ఆరోపించారు. కానీ, శాయశక్తుల రాజ్‌భవన్ ప్రతిష్టను కాపాడతానని ఆయన అన్నారు. రాష్ట్రంలో చట్ట పాలన లేదని ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన తేయాకు విందుకు సీఎం మమతా బెనర్జీ హాజరుకాకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు.

సీఎం హాజరుకాకపోవడంతో తాను నిశ్చేష్టుడైనట్టు తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను గౌరవించైనా పంద్రాగస్టున నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యే పరిణతి కలిగి ఉండాలని ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం ఖాళీ సీటు పశ్చిమ బెంగాల్‌ విలువలు ఇప్పడు ఏ స్థాయికి దిగజారాయో వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దాదాపు ఏడాది కాలంగా టీఎంసీ ప్రభుత్వానికి, గవర్నర్ తరుచూ వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, పంద్రాగస్టున రాజ్‌భవన్‌కు మర్యాదపూర్వక పర్యటన చేశారని సీఎం బెనర్జీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed