ఐపీఎల్‌లో అడుగుపెట్టిన టీవీ 9

by Shiva |   ( Updated:2020-08-27 09:25:06.0  )
ఐపీఎల్‌లో అడుగుపెట్టిన టీవీ 9
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో ఫ్రాంచైజీలకు నెమ్మదిగా స్పాన్సర్లు దొరుకుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)జట్టు తమ జెర్సీ భాగస్వామిగా ‘దుబాయ్ ఎక్స్‌పో’ను రూ.22 కోట్లకు నియమించుకుంది. అయితే మార్చి-మే నెల మధ్య జరగాల్సిన ఐపీఎల్ సెప్టెంబర్‌లో నిర్వహిస్తుండటంతో దుబాయ్ ఎక్స్‌పో తప్పుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది దుబాయ్ ఎక్స్‌పో నిర్వహించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 భారత్‌వర్ష్ ఆ జట్టుతో జతకలిసింది. ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. అయితే దుబాయ్ ఎక్స్‌పో కంటే 55 శాతం తక్కువ ధరకే రాజస్థాన్ రాయల్స్‌తో టీవీ9 ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. ఇండియాలో పలు భాషల్లో టీవీ9 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నది. వీరి గ్రూప్‌లోని భారత్‌వర్ష్ హిందీ న్యూస్ ఛానల్‌గా సేవలు అందిస్తున్నది. కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో షారుక్‌ఖాన్‌కు చెందిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టుకు కూడా జెర్సీ భాగస్వామిగా టీవీ9 వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story