- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్తాన్‌లో పురోహితుడి సజీవ దహనం
జైపూర్: రాజస్తాన్‌లో భూవివాదానికి సంబంధించి ఓ పురోహితుడిపై ఐదుగురు పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. కాలిన గాయాలతో పురోహితుడు గురువారం రాత్రి మరణించినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కరౌలి జిల్లాలోని సపోత్రా పోలీసు స్టేషన్ పరిధిలోని బుక్రా గ్రామంలోని రాధాగోపాల్ ఆలయంలో బాబూలాల్ వైష్ణవ్ కుటుంబం పౌరోహిత్యం చేస్తూ జీవిస్తున్నది.
మందిర్ మాఫీ కింద దేవాలయానికి సంబంధించిన భూమిని జీవనాధారానికి పురోహితులు ఉపయోగిస్తుంటారు. ఈ భూమిలో బాబూలాల్ పంట వేయగా మీనా కమ్యూనిటీకి చెందిన కైలాష్ మీనా వారించాడు. పంచాయితీ పురోహితుడివైపే తీర్పునిచ్చింది. అయినప్పటికీ కైలాష్ ఊరుకోలేదు. ఆ భూమిలో బాబూలాల్ వేసిన పంటకు నిప్పంటించాడు. బాబూలాల్ పైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాబూలాల్ గాయాలతో జైపూర్‌లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్‌లో గురువారం రాత్రి చనిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కైలాష్‌ను అరెస్టు చేశారని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు కరౌలి ఏఎస్పీ ప్రకాష్ చంద్ తెలిపారు.