మీ అందరి ప్రార్థనలకు కృతజ్ఞతలు : శివాని

by Jakkula Samataha |
మీ అందరి ప్రార్థనలకు కృతజ్ఞతలు : శివాని
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్‌తో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన హీరో రాజశేఖర్ ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉందని ఆస్పత్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని ప్ర‌క‌టిస్తూ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. అదేవిధంగా రాజశేఖర్ కుమార్తె శివాని కూడా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ వేదికగా స్పందించింది.

‘డాక్టర్ల బృందం మా నాన్నను ఎంతో జాగ్రత్తగా చేసుకుంటోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారు. మా నాన్న కోసం మీరంద‌రు చేస్తున్న ప్రార్థ‌న‌లకు కృత‌జ్ఞత‌లు’ అని శివాని ట్వీట్ చేసింది. మ‌రోవైపు రాజ‌శేఖ‌ర్ స‌తీమ‌ణి జీవిత‌కు క‌రోనా నెగెటివ్ రావ‌డంతో ఆమెను ఆస్పప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

సిటీ న్యూరో సెంటర్ వైద్యులు కూడా రాజశేఖర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేశారు. ఆయనను ప్రస్తుతం ఐసీయూలోనే ఉంచినట్లు, ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్య బృందం తెలిపింది.

Advertisement

Next Story