- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బూతులు’ మాట్లాడితే వచ్చే డబ్బులు నాకొద్దు..
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పుణ్యమా అని సినిమా హాళ్లు మూతపడటంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం OTT కంటెంట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అంతకుముందుకు వెబ్ సిరీస్‌లు అడపాదడపా హిట్ అయినా.. కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ భారీ స్థాయిలో పెరిగింది. దీంతో దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీల అగ్రతారలు వెబ్ సిరీసుల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
అయితే, OTT కంటెంటుల్లో ఇటీవల అసభ్యపదజాలంతో పాటు వల్గర్ కంటెంట్ ఎక్కువైందని విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కమెడీయన్ రాజ్‌పాల్ యాదవ్ వెబ్ సిరీస్ కంటెంట్‌లో నటించేందుకు అయిష్టతను వ్యక్తంచేశారు. ఓ ప్రొగ్రాంలో వెబ్‌సిరీస్‌లో నటించడానికి మీకు ఆసక్తి ఉందా అని యాంకర్ అడుగగా.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ మాట్లాడుతూ.. సినిమా తెరపై ‘దుర్వినియోగ భాష(బూతుపదాలు) ఉపయోగించడం’ నాకు ఇష్టం లేదు. ‘నిజ జీవితంలో నేను అభినందించని పనిని నేను చేయాలనుకోవడం లేదు. తెరపై చెడుగా మాట్లాడటం ద్వారా నేను డబ్బులు సంపాదించాలనుకోలేదు. అలా వచ్చే సంపాదన నాకొద్దు’ అని స్పష్టంచేశారు.