హైదరాబాద్‌లో తలైవా.. యాక్షన్ మొదలెట్టిన సూపర్ స్టార్

by Shyam |
rajini annathe poster
X

దిశ, సినిమా: స్టైల్‌కు కేరాఫ్, ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తె’. శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో యాక్షన్ కూడా సమపాళ్లలో ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. హెల్త్ ఇష్యూస్‌తో కొంతకాలం రెస్ట్ తీసుకున్న సూపర్‌స్టార్.. ‘అన్నాత్తె’ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. నయనతార, కీర్తిసురేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుండగా.. రజనీ తనదైన స్టైల్‌లో భారీ వాహనాల మధ్య యాక్షన్ సీన్స్ చేస్తున్నట్లు సమాచారం. దిలీప్ మాస్టర్ నేతృత్వంలో ఈ ఫైట్ సీక్వెన్స్‌ తెరకెక్కిస్తున్నారు. కాగా సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుంది.

Advertisement

Next Story