నెక్ట్స్ మూవీలో మహేష్‌ను మరో లెవల్‌లో చూపిస్తా.. జక్కన్న హామీ

by Shyam |   ( Updated:2021-12-11 02:48:10.0  )
నెక్ట్స్ మూవీలో మహేష్‌ను మరో లెవల్‌లో చూపిస్తా.. జక్కన్న హామీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్ రిలీజ్ బిజీ బిజీగా ప్రమోషన్ చేస్తున్న మూవీ యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. కాగా ఈ సమావేశంలో ఓ మీడియా పర్సన్ ‘మహేశ్‌ బాబుతో సినిమా ఎప్పుడు ఉంటుంది?’ అని జక్కన్నను ప్రశ్నించగా.. వెంటనే స్పందించిన డైరెక్టర్ ఈ చిత్రం రిలీజ్ అయ్యాక వెంటనే మొదలుపెడతామని తెలిపారు.

ఇప్పటికే ఈ విషయంపై చాలా సార్లు చర్చలు జరిపానని చెప్పిన జక్కన్న.. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తానని అన్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed