- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సమయంలో భూమి పూజ అవసరమా? : రాజ్‌థాక్రే
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం భూమిపూజ నిర్వహణపై వివిధ పార్టీల నాయకులు తమకు నచ్చిన రీతిలో స్పందిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్‌థాక్రే స్పందించారు. ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో ఈ కార్యక్రమం అవసరమా..? అంటూ తన భిన్న స్వరం వినిపించారు. పరిస్థితులు సాధారణం అయ్యాక భూమి పూజ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ-భూమి పూజ (వర్చువల్) నిర్వహించాలన్న మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రేపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడపడంలోనే ఉద్ధవ్ విఫలమయ్యారని ఆరోపించారు. పూజావిధానం గురించి ఉద్దవ్ చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు.
కాగా, ఆగస్టు 5వ తేదీన.. అయోధ్యలో జరిగే రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు అధికారికంగా వెల్లడించింది. మొత్తం 200మంది వరకు ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం.