పెళ్లి చేసుకుంటే పిల్లలను కనాలా? : హీరోయిన్

by Jakkula Samataha |
పెళ్లి చేసుకుంటే పిల్లలను కనాలా? : హీరోయిన్
X

దిశ, సినిమా : యాక్ట్రెస్ రైజా విల్సన్ ఫ్రాంక్‌గా మాట్లాడేస్తుంది. ఏ విషయమైనా సరే స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా మాట్లాడుతుంది. ఈ కారణాల వల్లే బిగ్ బాస్ తమిళ్ ఫస్ట్ సీజన్ ఫేవరేట్ కంటెస్టెంట్‌గా మారిపోయింది. ఈ మధ్య రాంగ్ ఫేషియల్ ట్రీట్మెంట్‌తో ఇబ్బంది పడి వార్తల్లో నిలిచిన రైజా విల్సన్.. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా వినూత్న నిర్ణయం తీసుకుంది.

తాజాగా అభిమానులతో సోషల్ మీడియా చిట్ చాట్‌లో పాల్గొన్న రైజా.. ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి అడిగితే వెరైటీ ఆన్సర్ ఇచ్చింది. సరైన పార్ట్‌నర్ దొరికితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానేమో కానీ పిల్లలను మాత్రం కనను అని చెప్పేసింది. 20 ఏళ్ల తర్వాత ప్రకృతి వనరులు అందుబాటులో ఉండే అవకాశం లేదని, వారు ఏ విషయంలోనూ ఆనందంగా ఉండలేరని అభిప్రాయపడింది. అలాంటప్పుడు బిడ్డలను కని వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకని అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed