ఫీజులు పెంచేసి చదువును కాస్ట్ ​లీగా  మార్చారు: విజయశాంతి

by Shyam |
Vijaya-Shanthi
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ ​తెలంగాణలోని అన్ని వర్సిటీల్లో కోర్సుల ఫీజులను అడ్డగోలుగా పెంచేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. నిరుపేదలకు విద్యను దూరం చేయాలని కుట్రపన్నారని ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. పీజీ, రెగ్యులర్, సెల్ఫ్​ఫైనాన్స్​ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ ఫీజులను డబుల్​, ట్రిపుల్​చేసి చదువును కాస్ట్​లీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కానీ రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని టీచింగ్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్న రెగ్యులర్​ ఫ్యాకల్టీని నియమించకుండా రాష్ట్ర సర్కార్​ చోద్యం చూస్తోందని ఫైరయ్యారు. వర్సిటీల్లోని ల్యాబ్​లో విద్యార్థులు ప్రాక్టికల్స్ ​చేసేందుకు కూడా సౌకర్యాలు లేకపోవడంతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన చెందారు. వర్సిటీల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాల్సిన ప్రభుత్వం ఆ భారాన్ని స్టూడెంట్లపై మోపేందుకు ఫీజులు పెంచేందుకు జీవో 141 ను తీసుకొచ్చిందని విజయశాంతి దుయ్యబట్టారు. కేసీఆర్​ ఫీజు రీయింబర్స్​ మెంట్​ కూడా సకాలంలో చెల్లించడం లేదని, దీంతో విద్యార్థులపై తీవ్ర భారం పడుతోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 141 జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్​చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఏండ్లుగా ఖాళీలున్నా రాష్ట్ర సర్కార్ ​భర్తీ చేయడం లేదని, ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. రెవెన్యూ శాఖకు గుండెకాయలాంటి సీసీఎల్​ఏ పోస్టును ఏడేళ్లుగా ప్రభుత్వం ఖాళీగానే పెట్టిందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కూడా సీసీఎల్​ఏ లేకుండానే చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సీసీఎల్​ఏగా సీనియర్​ ఐఏఎస్ ​రేమండ్​ పీటర్​ను నియమించిన ఏడాదిన్నర కాలం మాత్రమే కొనసాగించారని ఆమె వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed