ఇలాగే కొన‌సాగితే…?

by Sridhar Babu |
ఇలాగే కొన‌సాగితే…?
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఇటీవ‌ల మూడు రోజులుగా పాల్వంచ ఎగువ ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తుండ‌గా భారీగా వ‌ర‌ద నీరు కిన్నెర‌సాని జ‌లాశ‌యంలోకి చేరుకుంటోంది. 407 అడుగుల నీటి నిల్వ సామ‌ర్థ్యం ఉన్న రిజ‌ర్వాయ‌ర్‌లోకి ప్ర‌స్తుతం 1400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఆదివారం సాయంత్రం నాటికి 399.60 అడుగుల‌కు నీటి మ‌ట్టం పెరిగింద‌ని డ్యామ్ సైడ్ ఇంజ‌నీర్ తెలిపారు. వ‌ర‌ద‌నీటి ప్ర‌వాహం ఇలాగే కొన‌సాగితే సోమ‌వారానికి 400అడుగుల మేర‌కు పెరిగే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. కిన్నెర‌సాని ద్వారా పాల్వంచ‌, కొత్త‌గూడెం ప‌ట్ట‌ణాల‌కు తాగునీటి అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌టంతో పాటు చుట్టుప‌క్క‌ల ఉన్న కేటీపీఎస్‌తో పాటు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు నీటి అవ‌స‌రాల‌ను తీర్చుతోంది.

Advertisement

Next Story

Most Viewed