- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైల్ యాత్రి’ ప్రయాణీకుల డేటా లీక్?
దిశ, వెబ్‌డెస్క్ :
నెటిజన్లు ఉపయోగించే అనేక సర్వీస్‌లలో డేటాకు భద్రత లేకుండా పోతోంది. గతంలో ఫేస్‌బుక్ యూజర్ల డేటా పలు మార్లు లీకవ్వగా.. మొన్నటికిమొన్న 23.5 కోట్ల మంది ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, టిక్‌టాక్ యూజర్ల డేటా లీకైంది. తాజాగా ఆన్‌లైన్ రైల్ టికెట్ బుకింగ్ యాప్ ‘రైల్ యాత్రి’ వెబ్‌సైట్ నుంచి సుమారు 7 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటా లీకైనట్లు జాతీయ మీడియా తెలిపడం గమనార్హం.
ప్రతీరోజు.. సుమారు 23.9 మిలియన్ల ప్రజలు ట్రైన్ జర్నీ చేస్తుంటారు. కాగా ట్రైన్ సమాచారం కోసం ప్రభుత్వం.. ‘ఐఆర్‌సీటీసీ’ అనే వెబ్‌సైట్ రన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ యాప్‌తో పాటు మరెన్నో ప్రైవేటు యాప్స్, వెబ్‌సైట్‌లు నెటిజన్లకు రైల్ సమాచారంతో పాటు ట్రైయిన్ టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, లైవ్ లొకేషన్, ట్రెయిన్ ఆన్ ఫుడ్.. వంటి వివరాలను అందిస్తున్నాయి. అందులో ‘రైల్ యాత్రి‘ కూడా ఒకటి. 2011లో ప్రారంభమైన ఈ యాప్.. బెస్ట్ ట్రావెల్ యాప్‌గా నెటిజన్ల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా పొందింది. ఈ క్రమంలోనే మిలియన్ల కొద్దీ ప్రజలు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. కానీ, తాజాగా ఈ యాప్‌లోని డేటా లీకవడంతో ప్రయాణికులంతా ఆందోళన చెందుతున్నారు.
‘రైల్ యాత్రి’ వెబ్‌సైట్ నుంచి డేటా లీకైనట్లుగా సేఫ్టీ డిటెక్టివ్స్ అనే సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఆ సంస్థ అందించిన వివరాల ప్రకారం వినియోగదారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్, ఈ- మెయిల్ ఐడీ, లొకేషన్, టికెట్ బుకింగ్ వివరాల డేటా లీకైంది. అంతేకాదు.. క్రెడిట్, డెబిట్ కార్డ్ నెంబర్లు, యూపీఐ పిన్ నెంబర్లు కూడా లీక్ కావడం అందర్నీ కలవరపెడుతోంది. మియావ్ అటాక్ ద్వారా డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఎవరూ గుర్తించలేని వీపీఎన్‌ల నుంచి పలు అన్‌సెక్యూర్డ్ సర్వర్లపై దాడి చేయడాన్ని మియావ్ ఎటాక్ అంటారు. లీకైన డేటా మొత్తంగా 43 జీబీలు ఉంటుంది. లీక్ గురించి రైల్ యాత్రి సంస్థ మాత్రం ఒప్పుకోవడం లేదు. కస్టమర్ల విషయంలో తమ సంస్థ ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తుందని, కస్టమర్ల డేటా 24 గంటలు మాత్రమే ఉంటుందని, డేటా లీక్ కాలేదని రైల్ యాత్రి నిర్వాహకులు అంటున్నారు.