దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి..

by Anukaran |
Rahul Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ రైతులు దేశరాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అగ్రి చట్టాలు రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించడమే కాకుండా మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనికి దేశవ్యాప్తంగా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ దేశప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. రైతుల కోసం ప్రజలందరూ భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతులు పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్‌కు బహిరంగంగా సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. చివరగా ప్రధాని మోడీ రైతులను దొంగిలించడం ఇకనైనా మానుకోవాలని రాహుల్ గాంధీ హితవు పలికారు.

Advertisement

Next Story