మరిన్ని వేవ్‌లు రావొచ్చు.. కేంద్రానికి రాహుల్ గాంధీ వార్నింగ్

by Anukaran |
Rahul Gandhi
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మరిన్ని వేవ్‌లు రావొచ్చని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మొదటి, రెండో దశను అడ్డుకోవటంలో కేంద్రం విఫలం అయిందని విమర్శించారు. మంగళవారం కొవిడ్-19పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కరోనా థర్డ్ వేవ్ రాబోతోందనే విషయం చాలా స్పష్టమని రాహుల్ అన్నారు. వైరస్ మ్యూటేట్ అవుతోందని, దానిని ఎలా ఎదుర్కోవాలనే దానిని నిపుణులతో కలిసి చర్చించి, శ్వేతపత్రంలో సూచనలు చేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ అనేది అన్నింటికంటే చాలా ముఖ్యమని, చాలా వేగంగా వ్యాక్సినేషన్ జరిపి 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ఆసుపత్రులు, ఆక్సిజన్, పడకలు, ఇలా అవసరమైన వాటన్నింటినీ ముందుగానే ప్రభుత్వం సిద్ధం చేసి థర్డ్ వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

అందుకు తాము విడుదల చేసిన శ్వేతపత్రం ఉపకరిస్తుందని రాహుల్ చెప్పారు. ఇదొక ‘బ్లూప్రింట్’ అని చెప్పారు. థర్డ్ వేవ్ రాబోతున్న విషయం యావత్ దేశానికి తెలుసునని ఆయన పేర్కొన్నారు. తొలి, రెండో విడత కొవిడ్ మేనేజ్‌మెంట్‌‌ కారణంగా భారీ విపత్తు ఏర్పడిందనే విషయం చాలా స్పష్టమని, దీనికి కారణం ఏమిటో, ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పే ప్రయత్నం చేశామన్నారు. సోమవారం రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌లు ఇవ్వడం సంతోషకరమేనని, అయితే ఇది తూతూ మంత్రం కాకూడదన్నారు. ఒక్క రోజుకు పరిమితం కాకుండా దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేంతవరకూ ఈ తరహా పనితీరు చూపించాలని రాహుల్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed