'కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు'

by Shamantha N |
కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు
X

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై ముందునుంచీ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్న కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాఫెల్ డీల్‌పై అవకతవకలు జరిగాయని తాజాగా ఒక ఫ్రెంచ్ మీడియా కథనం పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ప్రతి పనులకు లెక్క ఉంటుందంటూ.. ‘కర్మ = ఒకరి చర్యలకు చిట్టాపద్దు.. దీనినుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అంటూ ట్వీట్ చేశారు. రాఫెల్ హ్యాష్ ట్యాగ్‌తో ఆయన ఈ ట్వీట్ పోస్ట్ చేశారు.

రాఫెల్‌ డీల్‌లో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. 2019 లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆయన ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. తాజాగా.. భారత్‌తో రాఫెల్ డీల్ కుదిరిన వెంటనే మనదేశానికి చెందిన ఓ దళారికి భారీ ‘గిఫ్ట్‌’ను చెల్లించిందని ఓ ఫ్రెంచ్ మీడియా సంస్థ ప్రచురించింది. 10 లక్షల యూరోల (రూ. 8.62 కోట్లు)ను భారత్‌కు చెందిన డస్సాల్ట్ సబ్‌కాంట్రాక్టు కంపెనీ డెఫ్‌సిస్ సొల్యూషన్స్‌కు ఇచ్చినట్టు ఫ్రాన్స్ అవినీతి నిరోధక అధికారుల (ఏఎఫ్ఏ) దృష్టికి వచ్చింది. ఇందులో సగం మొత్తాన్ని (508,925 యూరోలు) డస్సా్ల్ట్ సంస్థ తన చిట్టాల్లో ‘క్లయింట్లకు గిఫ్ట్’ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed