- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేను ఆ కేక్ కట్ చేయను : అజింక్య రహానే
by Shyam |

X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అందించిన కెప్టెన్ అజింక్య రహానేకు ముంబయిలోని తన స్వగృహం వద్ద అనూహ్యమైన స్వాగతం లభించింది. భాజాభజంత్రీలతో ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. తన కూతురు ఆర్యను ఎత్తుకొని, భార్య వెంట నడుస్తూ అక్కడ జరుగుతున్న సంబరాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రహానే గొప్ప మనసు మరోసారి అందరికీ తెలిసింది. స్థానికులు ఒక కేక్ తెచ్చి దాన్ని కట్ చేయాలని కోరారు. అయితే ఆ కేక్‌పైన కంగారూ బొమ్మ ఉండటంతో ఆ కేక్ కట్ చేయడానికి నిరాకరించాడు. కంగారూ బొమ్మ ఉంచిన కేక్‌ను కట్ చేసి ఆ దేశాన్ని అవమాన పరచలేనని రహానే తెగేసి చెప్పాడు. ఈ తతంగం అంతా ముంబయిలోని ఒక లోకల్ న్యూస్ చానల్‌లో ప్రసారం కావడంతో రహానే గొప్ప మనసు అందరికీ తెలిసింది. రహానే గొప్ప కెప్టెన్ అవుతాడనటానికి ఇదో ఉదాహరణ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Next Story