- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా రాజకీయాలా ’
దిశ, దుబ్బాక : దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా కొంతమంది వ్యక్తులు రాజకీయాలు చేయడం బాధాకరం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక అభివృద్ధికి అడుగడుగున అడ్డంకులు చూపడం సరైంది కాదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, గాంధీ విగ్రహం, ప్రభుత్వ ఆసుపత్రి, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలప్పుడు రాజకీయాలు చేయడం సహజం కానీ ప్రతి విషయంలోనూ అదే రాజకీయంగా మలుచుకోవడం సరికాదని పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దుబ్బాక అభివృద్ధికి పాటుపడుతుంటే కొంతమంది జీర్ణించుకోలేక, ఇప్పుడు అభివృద్ధి జరిగితే అది ఎమ్మెల్యే రఘునందన్ రావు కు మంచి పేరు వస్తుందనే కుట్రతో చెడగొట్టు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను ఇచ్చిన మాట ప్రకారం దుబ్బాక అభివృద్ధి కి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, కౌన్సిలర్ స్వప్న, బీజేపీ నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.