అదంతా అబద్ధం : రాఘవ లారెన్స్

by Shyam |
అదంతా అబద్ధం : రాఘవ లారెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి-2 తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌రోల్‌కు సంబంధించి అనేక అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నాయి. జ్యోతిక, సిమ్రాన్, కియారాల్లో ఎవరో ఒకరు ఆ రోల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన లారెన్స్ అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశాడు. ప్రధాన పాత్రలో నటించే కథానాయిక ఎవరన్నది త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానన్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ ఫీమేల్ లీడ్ విషయమై క్లారిటీ ఇస్తుందన్నారు. ఆ తర్వాత తాము అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed