సీఎం జగన్‌కు రఘరామ పదో లేఖ.. లేఖలో ఏముందంటే ?

by srinivas |
raghurama krishnam raju
X

దిశ, ఏపీ బ్యూరో : మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కోరుతూ నరసాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజు లేఖ రాశారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారని గుర్తు చేశారు. ఇప్పటికే నవహమీలు- వైఫల్యాల పేరుతో సీఎం జగన్‌కు తొమ్మిది లేఖలు రాసిన ఎంపీ.. తాజాగా నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరో లేఖ రాశారు. మరో 8లేఖలు రాస్తానని వెల్లడించారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో అమరావతిపై జగన్ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో 30 వేల ఎకరాల్లో రాజధాని ఉండాలని సూచించిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సరికాదన్నారు. మూడు రాజధానులపై సీఎం నిర్ణయం సరికాదని ఇప్పటికైనా మార్చుకోవాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed