Radhika Apte: న్యూడ్ ఫొటో లీక్.. నాలుగు రోజులు బయటకు రాని హీరోయిన్

by Shyam |   ( Updated:2021-05-21 03:00:42.0  )
Radhika Apte: న్యూడ్ ఫొటో లీక్.. నాలుగు రోజులు బయటకు రాని హీరోయిన్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ రాధికా ఆప్టే గ్రజియా మ్యాగజైన్‌పై మెరిసింది. ఎప్పటిలాగే సూపర్‌ హాట్‌గా కనిపించిన భామ బాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి తెలిపింది. 2005లో వచ్చిన ‘వాహ్! లైఫ్ హో తో ఐసీ’ సినిమాలో చిన్న క్యారెక్టర్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. 2016లో లీలా యాదవ్ దర్శకత్వంలో వచ్చిన ‘పార్చ్‌డ్’ మూవీలో సెక్స్‌వర్కర్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ‘క్లీన్ షేవెన్’ సినిమాకు పనిచేస్తున్న సమయంలో తన న్యూడ్ పిక్ లీక్ అయిందని.. సిగ్గుతో నాలుగు రోజులు బయట అడుగు కూడా పెట్టలేకపోయానని చెప్పింది. మీడియా ప్రచారం చేసినందుకు కాదు కానీ తన డ్రైవర్, వాచ్‌మెన్, స్టైలిస్ట్‌లు ఆ ఫొటోలో ఉంది తానేనని గుర్తించినందుకు చాలా సిగ్గుపడ్డానని చెప్పింది. కానీ ఈ కాంట్రవర్సియల్ ఫొటోగ్రాఫ్స్‌ను కొంచెం పరిశీలనగా చూస్తే తాను కాదని చెప్పొచ్చని తెలిపింది. కాబట్టి ఇందులో దాచాల్సిన అవసరం లేదని రియలైజ్ అయినట్లు వివరించింది రాధిక.

Advertisement

Next Story