ప్రభాస్ ఫ్యాన్ థియరీ : ఆ క్రూయిజ్ షిప్‌కు ‘రాధే శ్యామ్’కు సంబంధం?

by Shyam |
Radhyeshyam
X

దిశ, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ‘రాధే శ్యామ్’ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఫ్యూచర్‌ను ప్రెడిక్ట్ చేసే విక్రమాదిత్యగా ప్రభాస్ స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టగా.. 24 గంటల్లో 42 మిలియన్ ప్లస్ కౌంటింగ్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక టీజర్‌లో కనిపించిన విజువల్స్ హాలీవుడ్ మూవీ లెవెల్‌లో ఉండగా.. ఇందుకు సంబంధించి రోజుకో ఫ్యాన్ థియరీ వైరల్ అవుతోంది. జెనోవా పోర్ట్‌ దగ్గర 1956లో ప్రమాదానికి గురైన ఇటాలియన్ క్రూయిజ్ షిప్ ‘ఎస్ఎస్ ఆండ్రియా డొరియా’ స్టోరీకి ‘రాధే శ్యామ్’ కథకు ఏదో సంబంధం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ థియరీ వైరల్ అవుతుండగా.. మూవీ రిలీజైతే గానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు.

Advertisement

Next Story