- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాధే శ్యామ్’ టైటిల్ గురువు గారిదే!
డార్లింగ్ ప్రభాస్, బ్యూటీఫుల్ పూజా హెగ్డే ‘రాధే శ్యామ్’ సినిమా ఫస్ట్ లుక్‌కు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. ప్రభాస్ ఇమేజ్ ట్విట్టర్ రికార్డ్‌లో బెంచ్ మార్క్ సెట్ చేయగా.. తాజాగా అసలు ఈ సినిమా టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారనేది వివరించారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్. ముందుగా ఈ సినిమాకు జాన్ టైటిల్ అనుకున్నా.. సమంత, శర్వానంద్ కాంబినేషన్‌లో ‘జాను’ సినిమా రావడంతో సినిమా పేరు చేంజ్ చేద్దామనే నిర్ణయానికొచ్చినట్టు తెలిపారు. ఆ టైమ్‌లో అసలు ఏం టైటిల్ పెట్టాలో అర్థంకాక, తన గురువుతో ఈ చిత్రం కథ గురించి చెబితే.. రాధే శ్యామ్ పెడితే బాగుంటుందని సూచించారన్నారు. దీంతో అదే విషయాన్ని నిర్మాతలకు చెప్పడంతో ఫైనల్ చేశారట. ఇంతకీ రాధా కృష్ణ కుమార్ గురువు ఎవరో తెలుసా? డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. ఆయన దగ్గరే రాధాకృష్ణ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు.
ప్రభాస్ 20వ చిత్రంగా వస్తున్న రాధే శ్యామ్ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.