- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్ బొమ్మల కళాకారుల కథే ‘రాధాకృష్ణ’!
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ బొమ్మలు తయారు చేసే కళాకారుల నైపుణ్యత, వారి ఇబ్బందులు మెయిన్ థీమ్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. ఢమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో రూపొందుతున్న సినిమాకు టీడీ ప్రసాద్ వర్మ డైరెక్టర్ కాగా, హరిణి ఆరాధ్య క్రియేషన్స్ నిర్మిస్తోంది. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. మంచి ఆశయంతో తెరకెక్కుతున్న సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు.
తెలుగు సినిమాకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సినీపరిశ్రమ హైదరాబాద్‌లో ఎలాగైతే అభివృద్ధి చెందిందో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదేవిధంగా డెవలప్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన నటుడు అలీ.. నిర్మల్ బొమ్మల మీద తీసిన సినిమా బిగ్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా నందమూరి లక్ష్మీ పార్వతి ప్రధానపాత్రలో కనిపించబోతున్న సినిమాకు ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చారు.