- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్కులు తప్పనిసరి: మహేష్ భగవత్
దిశ, న్యూస్ బ్యూరో : ఇండ్ల నుంచి బయటకు వచ్చే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ సూచించారు. ఇదివరకు కరోనా లక్షణాలు ఉన్నవారు, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడేవారు, రోగులకు సేవలందించే వారు మాత్రమే మాస్కులు ధరించాలనే నిబంధన ఉండేదనీ, కాని ఇప్పుడు కొందరిలో కరోనా లక్షణాలు బయటకు కనిపించనప్పటికీ ఫలితాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ జరుగుతోందని ఆయన తెలిపారు. కాబట్టి మాస్కులు ధరించాలని చెప్పారు.
నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసిందనీ, మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం (Memo No 2133/D/2020) ఆదేశాలు జారీచేసిందని వివరించారు. జపాన్‌లోని ఓ అధ్యయనం ప్రకారం.. మాస్కుల వినియోగంతో కరోనా కేసుల వ్యాప్తి గణనీయంగా తగ్గినట్లు తేలిందని తెలిపారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చిన ‘మాస్క్ ఆన్ పాలసీ’ మార్గదర్శకాలను పాటించాలనీ, విధుల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ మాస్కులను ధరించాలని సూచించారు. కేవలం మాస్కు ధరించినంత మాత్రాన వైరస్ నివారణ సాధ్యం కాదనీ, సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు అనవసరంగా చేతులతో కళ్లను, ముఖాన్ని తాకవద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ సూచించారు.
Tags: everyone, must wear, masks, rachakonda cp, mahesh bhagwat, govt