- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్. నారాయణమూర్తి లవ్ స్టోరీ.. ఆ అమ్మాయితో బ్రేకప్ వలనే ఇలా ఉండిపోయాడంట
దిశ, వెబ్డెస్క్: ఆర్. నారాయణమూర్తి అంటే.. ఎర్రజెండా, విప్లవాలు, సిద్ధాంతాలు, రైతుల సమస్యలు ఇవే గుర్తొస్తాయి. ఆయన జీవితం కళామతల్లికి అంకితం.. సమాజంలో రైతులకు జరిగే అన్యాయాలను ఆయన తన సినిమాలతో ప్రజలకు కళ్లకు కట్టిన్నట్లు చూపిస్తారు. కోట్లు సంపాదించినా ఇప్పటికి నిరుపేద జీవితాన్నే అనుభవిస్తున్న గొప్ప వ్యక్తి ఆర్. నారాయణమూర్తి. ఇక ఇప్పటివరకు ఆయన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు 45 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి.. అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్న. కొంతమంది ఆయన సిద్ధాంతాలకు అడ్డు వస్తుందని పెళ్లి చేసుకోలేదని, మరికొంతమంది విప్లవ భావాల వలన అని చెప్పుకొచ్చారు. అయితే ఇవేమి తాను పెళ్లి చేసుకోవడానికి కారణం కాదని, తన లవ్ ఫెయిల్యూర్ వలనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాయని ఆర్. నారాయణమూర్తి చెప్పడం సంచలనంగా మారింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్. నారాయణమూర్తి తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటని అడగగా.. ” నేను కూడా పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని గడపాలని ఎన్నో కలలు కన్నాను. నేను నటుడిగా మారిన సమయంలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. ఆ విషయాన్నీ వాళ్లింట్లో కూడా చెప్పాను. కానీ, వారు మా ఇద్దరి కులాలు వేరని, అందులోను నేను నటుడైనందున పెళ్లికి ఒప్పుకోలేదు. మనసుకు నచ్చిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేక ఇలా జీవిస్తున్నా” అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అప్పుడు పెళ్లి చేసుకోకపోవడంపై ఇప్పుడు బాధపడుతున్నానని, ప్రతిఒక్కరికి తోడు అనేది అవసరమని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
- Tags
- love story