- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రైతన్న’ సినిమాను ఆదరించండి : ఆర్.నారాయణ మూర్తి
దిశ, మిర్యాలగూడ: త్వరలో థియేటర్లలో విడుదల కానున్న ‘రైతన్న’ సినిమాను చూసి ఆదరించాలని పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కోరారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి రైతన్న సినిమా తీసిన సందర్భాన్ని వివరించారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలుతో రైతన్నలకు చేకూరే ప్రయోజనం, కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు జరిగే నష్టాన్ని ఈ చిత్రం వివరిస్తోందని తెలిపారు. రైతులు పంటలు పండించడం మానేస్తే ప్రజలు పడే కష్టాలు సైతం ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశామని అన్నారు. అనంతరం నారాయణమూర్తిని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు డబ్బీకార్ మల్లేష్, రవినాయక్, వైస్ ఎంపీపీ పాదూరి గోవిందమ్మ, మల్లు గౌతంరెడ్డి, పాండు, పద్మమ్మ, పతాని శ్రీనులు శాలువాతో నారాయణ మూర్తిని ఘనంగా సన్మానించారు.