- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇకపై వైద్యుల క్వారంటైన్.. ఆన్‌డ్యూటీనే
న్యూఢిల్లీ: కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు క్వారంటైన్‌లో ఉన్న రోజులనూ ఆన్‌డ్యూటీగానే పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, ఎయిమ్స్ డైరెక్టర్లకు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్‌లకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ లేఖ రాశారు. కొవిడ్-19 డ్యూటీలు చేసిన వైద్యులు, హెల్త్ వర్కర్లు క్వారంటైన్‌లోకి వెళితే ఆ రోజులను ఆన్‌డ్యూటీగానే పరిగణించాలని ఆదేశించారు.
వైద్యుల క్వారంటైన్ పీరియడ్‌ను లాస్ ఆఫ్ ఫేగా పరిగణిస్తున్నారన్న కొందరి ఫిర్యాదుతో ఈ విషయంపై సుప్రీంకోర్టు విచారిస్తున్నసంగతి తెలిసిందే. అప్పటి నుంచి పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌తో ఆరోగ్య శాఖ సంప్రదింపులు జరిపిందని, చివరికి క్వారంటైన్‌లో ఉన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఆ రోజులను ఆన్‌డ్యూటీగానే పరిగణించాలని నిర్ణయించినట్టు లవ్ అగర్వాల్ వెల్లడించారు. వైరస్‌కు ఎక్స్‌పోజ్ అయిన డాక్టర్లు తొలుత ఒకవారం క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితుల మేరకు మరోవారం పొడిగించే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.