- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్‌టెల్‌కు రూ. 5,237 కోట్ల నష్టం!
దిశ, సెంట్రల్ డెస్క్: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 5,237 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. స్పెక్ట్రమ్ చార్జీలకు సంబంధించి తీర్పు కారణంగా రూ.7,004 కోట్లు చెల్లించడం వల్ల నష్టాలు ఈ స్థాయిలో పెరిగినట్టు కంపెనీ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికానికి సంస్థ లాభం రూ. 107.2 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఏకీకృత ఆదాయం 15.1 శాతం వృద్ధితో రూ. 23,723 కోట్లకు చేరాయి. ఈ మొత్తంలో ఇండియా నుంచి వచ్చిన ఆదాయం రూ. 17,438 కోట్లతో 14.4 శాతం వృద్ధి చెందినట్టు కంపెనీ ప్రకటించింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో వినియోగదారు నుంచి సగటు ఆదాయం రూ. 154గా ఉంది. ఏడాది క్రితం ఇది రూ. 123 మాత్రమే ఉండేది. 4జీ వాడే వినియోగదారులు పెరగడం, టారిఫ్‌లు పెరగడంతో మొబైల్ అదాయం 21.8 శాతం వృద్ధి నమోదైంది. మార్చి 31 నాటికి ఎయిర్‌టెల్ వినియోగదారులు 42.3 కోట్లకు చేరినట్టు, క్రితం ఏడాది మార్చి 31 నాటికి ఉన్న 40.4 కోట్లతో పోలిస్తే 4.9 శాతం వినియోగదార్లు పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. మార్చి 31 నాటికి ఎయిర్‌టెల్ ఏకీకృత నికర అప్పులు రూ. 88,251 కోట్లు ఉన్నట్టు పేర్కొంది.