అక్కడి చాయ్.. ‘ప్రేమమయం’

by Shyam |   ( Updated:2020-12-18 03:06:33.0  )
అక్కడి చాయ్.. ‘ప్రేమమయం’
X

దిశ, వెబ్‌డెస్క్: నలుగురు స్నేహితులు కలిసినా, నాలుగు ముచ్చట్లు షేర్ చేసుకోవాలన్నా అందుబాటులో ఉండే అడ్డా.. ‘టీ స్టాల్’. అందుకే దేశ ప్రధాని సైతం తన కార్యక్రమానికి ‘చాయ్ పే చర్చా’ అని పేరు పెట్టుకున్నారు. నిజానికి చాయ్ అంటే ఓ అలవాటు మాత్రమే కాదు, అప్పటికప్పుడు మన మూడ్‌ స్వింగ్‌ను మార్చేసే ఓ అద్భుతమైన పానీయం. తలనొప్పితో ఉన్నప్పుడు ఒక్క కడక్ చాయ్ తాగితే, ఇట్టే తగ్గిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ టీ ఉపోధ్ఘాతం అంతా ఎందుకంటే.. మధ్యప్రదేశ్‌లోని ఓ చాయ్‌వాలా ప్రేమ పక్షులతో పాటు భగ్న ప్రేమికులను, కొత్త జంటలను ఆకట్టుకునేందుకు వారి మూడ్‌కు తగ్గ ‘చాయ్ రుచుల’ను పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ ఆ మూడ్స్ ఏంటి? భగ్న ప్రేమికులకు, సింగిల్స్‌కు ఆ చాయ్‌వాలా అందించే స్పెషల్ టీ ఏంటో? తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్, గ్వాలియర్‌కు చెందిన ఓ టీ సెల్లర్.. తన ‘కలు బేవాఫా చాయ్‌వాలా’ టీ స్టాల్‌లో మీ మూడ్‌కు తగ్గ చాయ్ అందిస్తానంటూ, అందుకు తగ్గట్టుగా రకరకాల పేర్లతో చాయ్ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. సాధారణంగా ప్రేమలో విఫలమైన కుర్రకారు డిప్రెషన్‌ మూడ్‌లోకి వెళ్లిపోతుంటారు. అలాంటివారి మూడ్‌ను మార్చేందుకు ‘ప్యార్ మే ధోకా చాయ్’ (హార్ట్ బ్రోకెన్ ఇన్ లవ్ టీ) అందిస్తున్నాడు. విఫల ప్రేమికులకే కాదు, తమ ప్రేమను సాధించుకుని జంటగా వచ్చే లవ్‌బర్డ్స్ కోసం ‘నయీ ప్రేమియోంకి చాయ్’(టీ ఫర్ న్యూ లవర్స్), ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకు ‘ప్రేమి జోడో కే లియే స్పెషల్ చాయ్’(స్పెషల్ టీ ఫర్ కపుల్స్) అక్కడ సిద్ధంగా ఉంటాయి. ఇక ఈ లవ్వు, కొవ్వులు మనకొద్దుగానీ.. కాస్త ప్రేమను పంచే మనిషి ఉంటే చాలనుకునే వారి కోసం ‘మన్ చాహ ప్యార్ పానె కె లియో చాయ్’ (టీ టు గెట్ ద కైండ్ ఆఫ్ లవ్ యు విష్ ఫర్) అక్కడ పొగలు కక్కుతూ వెయిట్ చేస్తుంటుంది. అసలు నాకు ఈ ప్రపంచంతోనే సంబంధం లేదు.. నేను ఒంటరి, నాకు నేనే బలం, నేనే బలహీనత అనే ఒంటరిపక్షుల కోసం ‘అఖేలాపన్ చాయ్’ (లోన్లీనెస్ టీ) రారమ్మని పిలుస్తుంటుంది. వీటన్నింటికి తోడు భార్యా బాధితులైన భర్తల కోసం మరో స్పెషల్ టీ కూడా అందిస్తున్నాడీ చాయ్‌వాలా.

కాగా ఇటీవలే ఓ ట్విట్టర్ యూజర్.. ఈ టీ స్టాల్ బోర్డ్‌ను షేర్ చేయగా, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఈ చాయ్‌వాలా తప్పకుండా త్వరలోనే బిలియనీర్ అవుతాడు, ఇది చాలా బ్రిలియంట్ ఐడియా. డిఫరెంట్ బ్రాండింగ్, వావ్ ప్రతి మూడ్‌కు ఓ చాయ్.. అద్భుతమైన ఆలోచన’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజమే మరి ‘టీ’ తాగితే, తప్పకుండా మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది.

మరి ఇదంతా చదివాక, ఓ కప్పు టీ తాగకపోతే ఎలా.. కమాన్ టీ లవర్స్ హావ్ ఏ వండర్‌ఫుల్ కఫ్ ఆఫ్ టీ.

Advertisement

Next Story

Most Viewed