- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నా బండిలో ఆమెను ఇంట్లో దింపండి: అనంతపురం డీఎస్పీ
కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు వైద్యులు శక్తి వంచనలేకుండా కష్టపడుతున్నారు. ప్రభుత్వాలు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. వైద్యులు ఆస్పత్రుల్లో, నేతలు ఆఫీసుల్లో ఉండి చర్యలు చేపడుతుంటే.. మండులెండల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రజల కష్టాలను పోలీసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మందుల కోసం తండ్రి ఇంటికి వెళ్లిన వ్యక్తిని శిక్షించి అతని మరణానికి ఎస్సై కారణమైతే.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణ పరిధిలో బాలింత ఇబ్బందిని గుర్తించి తన వాహనంలో దింపాలని ఆదేశించిన డీఎస్పీ వారి పాలిట దేవుడయ్యారు. దాని వివరాల్లోకి వెళ్తే..
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్టీటీ ఆస్పత్రిలో ఈ నెల 13న పురుటి నొప్పులతో ఉప్పొంక గ్రామానికి చెందిన మంగమ్మ జాయిన్ అయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆమె సంరక్షణ చూసిన వైద్యులు నిన్న డిశ్చార్జ్ చేశారు. ఆమెను తీసుకుని ఆమె భర్త ఇంటికి బయల్దేరారు. విధుల్లో ఉన్న డీఎస్పీ వెంకటరమణ వారిని ఆపి వివరాలు తెలుసుకున్నారు. పచ్చి బాలింత అంత దూరం వెళ్లడం కష్టమని భావించి తన వాహనంలో ఆమెను ఇంటికి పంపారు. దీంతో వారు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
Tags: anantapuram district, kalyana durgam, police, new born baby, dsp venkata ramana